0

మహిళలు కూడా ఇక నిల్చుని మూత్రవిసర్జన చేయవచ్చు


మహిళలకు శుభవార్త. ఇకపై మీరు పబ్లిక్ టాయిలెట్లలో మూత్ర విసర్జన చేసేందుకు ఏ మాత్రం వెనుకాడనవసరం లేదు. దుర్గంధభరితమైన పబ్లిక్ టాయిలెట్లలో ముక్కుమూసుకుని, అందునా కూర్చోని మూత్ర విసర్జన చేయడానికి అయిష్టతతో అలానే భరించి యూరిన్ ఇన్ఫెక్షన్ కు గురైయ్యే మహిళలు కోసం ఒక విప్లవాత్మకమైన ఉత్పత్తి వచ్చింది. పబ్లిక్ టాయ్ లెట్స్, కార్యాలయాలు, బస్టాపులు, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, నైట్ క్లబులు, మాల్స్, సినిమా ధియేటర్లు, స్నేహితుల ఇల్లు, ప్రయాణ సమయాల్లో, లేదా గర్భం దాట్చిన సమయాల్లో మూత్రానికి వెళ్లడం ఇబ్బందికరంగా ఫీలవుతుంటారు.


అయితే ఇకపై మీకు ఆ ఇబ్బందులు అవసరం లేదు..? ఎందుకంటారా.. ఇకపై మీరు మగవారి మాదిరిగానే.. నిల్చుని మూత్రవిసర్జన చేయవచ్చు. భారత దేశంలో మహిళ మూత్ర విసర్జనకు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలోని ఓ సంస్థ మహిళలు నిల్చుని మూత్ర విసర్జన చేసేందుకు  వీలుగా.. వాడి పడేసే పరికరాన్ని రూపోందించారు. పీ బడ్డీ అన్న పేరుతో దీనిని దుర్గంధభరితమైన టాయిలెట్లలో మహిళలు కూర్చోకుండా నిలబడి మూత్ర విసర్జన చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మార్కెట్ లో లభ్యమవుతున్న పీ బడ్డీ లను తెచ్చుకుని వాడిచూడండి. 
     
Previous
Next Post »