0

“శివుని ఆన” అంటూ మారుమోగిపోతున్న బాహుబలి…

రాజమౌళి , ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ముఖ్య తారాగణం తో అతి త్వరలో మన ముందుకు రాబోతున్న ‘బాహుబలి’ చిత్రం రోజురోజుకి అంచలనాను రెట్టింపు చేసుకుంటూ పోతుంది..ఈ నెల 13న విడుదల కాబోతున్న ఈ చిత్ర ఆడియో ఫై కొండత ఆశగా ఎదురుచూస్తున్న ఫాన్స్ కి తాజాగా రిలీజ్ అయిన బాహుబలి చిత్రంలోని “శివుని ఆన” సాంగ్ మొబైల్స్ లో , ఇంటర్ నెట్ లో, మ్యూజిక్ సెంటర్ లలో మారుమోగిపోతుంది. ఈ పాటని లేహరి మ్యూజిక్ విడుదల చేసింది. ఈపాట 90 శాతం లిరిక్స్ శివ తాండవ స్తోత్రం నుంచి తీసికొనబడినవి అని సాంగ్ వింటే అర్ధం అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఎంతో ఇష్టంగా , కష్టపడి చేసిన ఈ సాంగ్ చాల బాగుంది. ఆడియన్స్ కోసం ఈ సాంగ్ ఫుల్ లిరిక్స్ మీము అందిస్తున్నాం..విని ఎంజాయ్ చేయండి…
శివుని ఆన లిరిక్స్:
జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ.
ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏతల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది ఎవ్వరు కనంది ఎక్కడా వినంది శివుని ఆన అయిందేమో గంగనడిగి లింగమే కదిలోస్తానంది.
ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని.
జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి.
ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏతల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది ఎవ్వరు కనంది ఎక్కడా వినంది శివుని ఆన అయిందేమో గంగనడిగి లింగమే కదిలోస్తానంది.
         
ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. జూలై 10 తెలుగు, హిందీ, తమిళ, మళయాల భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Previous
Next Post »