0

త్రిష - వ‌రుణ్‌ల మ‌ధ్య‌ చిచ్చురేపిన హీరో ఎవ‌రు?


త్రిష‌, వ‌రుణ్ దాదాపుగా విడిపోయినట్టే. వీళ్లిద్ద‌రి మ‌ధ్య చెప్ప‌లేనంత‌, పూడ్యుకోలేనంత గ్యాప్ పెరిగిపోయింద‌ని చెన్నై వ‌ర్గాలు చెప్పుకొంటున్నాయి. అయితే వీరి క‌టీఫ్‌కి ఓ హీరో కార‌ణ‌మ‌ట‌. 

ఆ హీరో ఎవ‌రో కాదు... ధ‌నుష్ అని వినికిడి. త్రిష, ధ‌నుష్ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్‌. ఆ ఫ్రెండ్‌షిప్ వ‌రుణ్‌కి న‌చ్చేది కాద‌ట‌. ఈ విష‌యాన్ని చాలాసార్లు త్రిష‌తో చెప్పాడ‌ట‌. ఈ విష‌యంలో త్రిష‌, వ‌రుణ్‌ల మ‌ధ్యపెద్ద ఎత్తున గొడ‌వ‌ల‌య్యాయ‌ని టాక్‌. 

ఓ పార్టీకి కావాల‌నే ధ‌నుష్‌ని ఆహ్వానించి త‌న‌తో.. చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యింద‌ట‌. అది చూసిన వ‌రుణ్‌.. త‌ట్టుకోలేక‌పోయాడ‌ని, అందుకే త్రిష కి క‌టీఫ్ చెప్పేశాడ‌ని త‌మిళ తంబీలు గుస‌గుస‌లాడుకొంటున్నారు. ప్రియుడి కంటే ఫ్రెండ్‌షిప్‌ని విలువ ఇచ్చిన త్రిష‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంతో త్రిష‌కే తెలియాలి
Previous
Next Post »