0

మధుశాలిని కమల్‌తో లిప్‌లాక్‌ చేసిందా?

సినిమా విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలను చేసే సౌతిండియన్ స్టార్ హీరో కమల్ హాసన్.. రొమాంటిక్ సీన్స్ విషయంలోనూ యమస్పీడ్ గా ఉంటాడు. ఇప్పటికీ తన సినిమాల్లో లిప్ లాక్ సీన్లు ఉండేలా ప్లాన్ చేసుకునే ఈ సీనియర్ హీరో.. తన కొత్త సినిమా తూంగవనమ్ లోనూ లిప్ లాక్ సీన్ లో నటించాడని.. సినిమా పోస్టర్ చూస్తేనే అర్థమవుతుతోంది. 

అయితే కమల్ లిప్ లాక్ చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరనే విషయంపై కొంతకాలంగా సస్పెన్స్ నెలకొంది. కమల్ లిప్ లాక్ చేసింది ఈ సినిమాలో నటిస్తున్న అందాల భామ త్రిషతోనేనా అని కొందరు ఆరా తీశారట. అయితే కమల్ హాసన్ తో కలిసి ముద్దుసీన్ లో నటించిన ఆ హాట్ బ్యూటీ.. మధుశాలిని అని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. 

త్రిషతో పాటు మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో మధుశాలిని కూడా యాక్ట్ చేస్తోందని వినిపిస్తోంది. కొంత కాలం వర్మ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన ఈ అందాల భామ.. ఆ తరువాత అవకాశాలు తగ్గిపోవడంతో ఆడియెన్స్ కు పెద్దగా కనిపించలేదు. దీంతో ఆమె ఫేడౌట్ అయిపోయిందని చాలామంది భావించారు. 

కానీ ఏకంగా కమల్ సినిమాలో నటించడంతో పాటు ఈ సీనియర్ హీరోతో లిప్ లాక్ సీన్ చేసిందనే న్యూస్ మరోసారి మధుశాలిని గురించి అందరూ చర్చించుకునేలా చేస్తోంది.
Previous
Next Post »