0

కోతిపైన ఎఫ్ఐఆర్?


ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పోలీసులకు ఓ మహిళ షాక్ ఇచ్చింది. తన బంగారు గొలుసు దొంగిలించిన కోతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. కోతి ఏమిటి, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏమిటి అని వారు విసుక్కున్నారు. ఇదెక్కడి గోలరా బాబూ అంటూ పరేషాన్ అయ్యారు. 

మనిషి అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు, ఎక్కడ ఉన్నా వెతికి పట్టొచ్చని.. కానీ కాన్పూర్ లో వందల సంఖ్యలో కోతులు ఉంటాయని, చైన్ లాక్కెళ్లింది ఫలానా కోతే అని గుర్తు పట్టడం ఎలా సాధ్యమవుతుందని ఖాకీలు తలలు పట్టుకున్నారు. అయితే ఫిర్యాదు తీసుకోవాల్సి బాధ్యత ఉంది కాబట్టి.. పోలీసులు ఆ పని అయితే చేశారు. 

వివరాల్లోకి వెళితే.. ఊర్మిలా సక్సెనా అనే మహిళ ఆలయానికి వెళుతుండగా, మార్గంలో ఓ కోతి ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు చైన్ ను లాక్కెళ్లింది. దీంతో ఆమె వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లనైతే వెళ్లారు కాని..ఆ కోతిని గుర్తుపట్టడం ఎలాగో తెలియక చేతులెత్తేశారు. చివరకు మున్సిపాలిటీ సిబ్బందిని ఆశ్రయించి.. ఆ ప్రాంతంలో ఉండే కోతులన్నింటిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు
Previous
Next Post »