0

ఇది ఆడది కానే కాదు.. ఏ కోశాన ఆడ లక్షణం లేదు..

Lady don carries pistol runs tractor over another to grab land illegally cops
ఆడవారంటే. చాలా సున్నిత మనస్కులు, శాంతి, సహనానికి ప్రతిరూపాలని చదువుకున్నాం. కానీ అడవారంటే.. మగవారికన్నా దారుణంగా బరితెగించి.. వ్యవహరిస్తున్న వారు వుంటారా..? అంటే.. నూటికి నూరు శాతం వుంటారన్నడానికి ఈ లేడీ డాన్ నిలువెత్తు నిదర్శనం. మరోలా చెప్పాలంటే.. ఈమె అడది కానే కాదు. ఆడ లక్షణం ఏ కోశానా లేదు. అంతలా అమె ఏం చేసిందనుకుంటున్నారా..? ఇది ఏ టీవీ సిరియల్, లేదా బాలీవుడ్ సినిమాకు సంబంధించిన కథ కాదు. యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమ్యతే దేవతాం అని విశ్వసించే సంస్కృతి సంప్రదాయాలున్న భారతావనిలో జరిగిన ఘటన.  అందులోనూ దేశరాజధాని న్యూఢిల్లీకి అత్యంత చేరువలో వున్న రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.     

ఉత్తర్ ప్రదేశ్ అనగానే అటవిక రాజ్యం కళ్లముందు కనబడుతోందని... దౌర్జన్యాలు, దమనకాండలు, రౌడీయిజం ఒకటి, రెండు కాదు అన్ని రకాల నేరాలకు పుట్టినిల్లని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలోనే మరో అలాంటి ఘటనకు నెలవైంది. అయితే ఈ సారి మగవారు కాదు. ఏకంగా ఓ మహిళ లేడీ డాన్ లా వ్యవహరించి.. నడుములో పిస్తోలు పెట్టుకుని సాగించిన దౌర్జన్యకాంఢ ఇది. అడ్డుకోబోయిన ఆడవారిని తన ట్రాక్టర్ కింద పడేసి తొక్కించిన నరరూప రాక్షసిలా మారింది. ఈ ఘటన జిల్లాలోని బిజ్నోర్ జిల్లాలో జరిగింది. అది కూడా జిల్లా మెజిస్ట్రేటు.. (కలెక్టర్) నివాసానికి కూతవేటు దూరంలో..

వివరాల్లోకి వెళ్తే.. ఓ చర్చిపక్కను వున్న భములను పటపగలు కబ్జా చేసేందుకు రంగంలోకి దిగిన లేడి డాన్.. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ.. తనకు ఎవరు అడ్డురావద్దని వస్తే తుపాకీతో కాల్చివేస్తానని బెదిరించడంతో పాటు.. ట్రాక్టర్ తో సదరు భూముల్లో వున్న పంటను నాశనం చేసింది. అడ్డుకునేందుకు ఓ మహిళ ప్రయత్నించగా, అమె మీదనుంచి ట్రాక్టర్ ను పోనిచ్చింది. అదృష్టవశాత్తు ఆ మహిళ గాయాలతో భయపడింది.. ఇంత తతంగం నడిచినా.. రంగంలోకి ఆలస్యంగా వచ్చిన పోలీసులు అమెను స్టేషన్ కు తీసుకువెళ్లారు. అయితే అమెపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలిపెట్టారు. కాగా ఈ లేడీ డాన్ వ్యవహరాన్ని మొత్తం కెమెరాలలో బంధించిన అక్కడి ప్రజలు దీనిని సోషల్ నెట్ వర్క్ లో అప్ లోడ్ చేయడంతో.. ఇప్పుడా వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికైనా పోలీసులు అమెపై చర్యలు తీసుకుంటారో..? లేదో వేచి చూడాలి మరి.
Previous
Next Post »