0

నాసాకు మరో భూమి లాంటి గ్రహం చిక్కిందట...

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చిర కాలం నాటి కల ఫలించినట్టుంది. మానవ మనుగడకు అనువైన భూమిని పోలిన మరో గ్రహం కోసం ఏళ్ల తరబడిగా నాసా గాలిస్తూ వచ్చింది. ఇప్పటిగానీ భూమి లాంటి మరో గ్రహం నాసా కంటపడినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని నాసా శాస్త్రవేత్తలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అందుకోసం గురువారం నాసా అధికారులు ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. 

ఈ విషయాన్ని నాసా అధికారి వెబ్ సైట్‌లో వెల్లడించారు. అందులో.. భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి 7 గంటలకు ఈ విషయాన్ని నాసా శాస్త్రవేత్తలు వివరించనున్నట్టు తెలిపారు. కెప్లర్ మిషన్‌లో భాగంగా తాము కనుగొన్న నూతన విషయాలను నాసా తెలియజేయనుందని తెలిసింది. కాగా కెప్లర్ టెలిస్కోప్ ఇప్పటివరకూ 1000కి పైగా గ్రహాలను కనుగొంది. వీటిల్లో భూమిని పోలిన మానవ జాతి మనుగడకు అనువైన గ్రహం వివరాలను తెలుపనున్నారు.
Previous
Next Post »