0

త‌ల్లి కాబోతున్న స్వీటీ అనుష్క‌


బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమాల‌లో న‌టిస్తున్న స్విటీ బ్యూటీ అనుష్క తొలిసారి త‌ల్లి పాత్ర‌లో న‌టిస్తోంది. య‌ముడు, సింగం లాంటి సినిమాల్లో సూర్య‌కు జోడీగా న‌టించిన అనుష్క ఆ రెండు సినిమాల‌లోను సూర్య‌కు ల‌వ‌ర్‌గానే క‌నిపించింది. అయితే ఈ సీరీస్‌లో వ‌స్తున్న సింగం 3 సినిమాలో మాత్రం ఈ జంట‌కు పెళ్లి చేసేయాల‌ని దర్శ‌కుడు సింగం హ‌రి డిసైడైపోయార‌ట‌.
సింగం 3లో వీరికి పిల్లలు కూడా ఉంటారని తెలుస్తోంది. దీంతో గృహిణి పాత్రకు తగ్గట్టుగా అనుష్కను కొంచెం బరువు పెరగాలని హరి సూచించారట. ప్రస్తుతం ఆమె ఆర్యకు జోడీగా సైజ్ జీరో సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.
ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఆమె కాస్త గ్యాప్ తీసుకుని సింగం 3 కోసం బ‌రువు పెరిగేందుకు క‌స‌ర‌త్తులు చేస్తుంద‌ట‌.
Previous
Next Post »