0

చనిపోయే రోజు రాజీవ్ గాంధీ వైజాగ్ కు ఎందుకొచ్చారు..

చనిపోయే రోజు రాజీవ్ గాంధీ వైజాగ్ కు ఎందుకొచ్చారు..
భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ చనిపోయే రోజు సాయంత్రం ( మే 21, 1991) వైజాగ్ లో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించిన రాజీవ్ గాంధీ చివరగా వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరారు. తాను ప్రయాణిస్తున్న కింగ్ ఎయిర్ విమానం నుండి చైన్నై వెళ్లేందుకు సిద్దమయ్యారు. అది సాంకేతిక లోపంతో ఆగింది. వైజాగ్ నుంచి చైన్నైలోని శ్రీ పెరంబదూర్ కు వెళ్లేందుకు ఆయన నిరీక్షించినా..ఎంతకూ విమానం బాగుకాలేదు. విమానంలో కమ్యూనికేషన్ సిస్టమ్ ను సరి చేసేందుకు కెప్టెన్ చందోక్ తో పాటు..స్వతహగా పైలెట్ అయిన రాజీవ్ గాంధీ ప్రయత్నించారు. ఇక లాభం లేదనుకుని ఇవాల్టికి వైజాగ్ లోని విశ్రాంతి తీసుకుంటానని చెప్పి రాజీవ్ సిటీలోకి బయలుదేరి వెళ్లారు. అరగంట లోపే పైలెట్ నుంచి రాజీవ్ గాంధీకి సమాచారం వచ్చింది. విమానంలోని కమ్యూనికేషన్ వ్యవస్థను సరి చేశామనేది సారాంశం. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని చైన్నైకి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 6.30 నిమిషాలకు బయలుదేరిన విమానం..మద్రాసులోని మీనంబాకం విమానాశ్రయానికి రాత్రి 8.20 నిమిషాలకు దిగింది. 

అనంతరం పెరంబదూర్ సభాస్థలికి వెళ్లిన సమయంలో ముందుగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రాజీవ్ గాంధీ. అనంతరం అక్కడున్న వారికి అభివాదం చేసుకుంటు సభా స్థలిలో ఎర్ర తివాచీ స్థలానికి చేరుకున్నారు. అదే అవకాశం కోసం ఎదురు చూస్తున్నఎల్టీటీఐ సభ్యురాలు ధాను ముందుకు కదిలింది. మెడలో చందనపు పూల మాల వేసేందుకు అన్నట్లు రాజీవ్ గాంధీ వద్దకు వెళ్లి వంగింది. అంతే తన నడుముకు చుట్టుకున్న బాంబు మీటను నొక్కింది. అంతే ఒక్కసారిగా భీకర పేలుడు రాజీవ్ గాంధీతో పాటు..15 మంది పైకి గాలిలోకి ఎగిరారు. 20 అడుగుల ఎత్తువరకు అగ్ని జ్వాలలు ఎగిరాయి. చుట్టు పొగ కమ్ముకుంది. హాహాకారాలు, ఆర్తనాదాలు, కన్ను పొడుచుకున్న కనిపించని దట్టమైన పొగ. కేకలు, అరుపులు, ఏడుపులు. భయం, ఆందోళన, కంగారు. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే రాజీవ్ గాంధీ ఉండాల్సిన చోట లేరు. అప్పటి కాంగ్రెస్ నేత జీకే మూపనార్ లాంటి వాళ్లు తమ ప్రియతమ నేత కోసం ఆ పొగలోనే వెతికారు. మొదటగా రాజీవ్ గాంధీ బూట్ దొరికింది. తల వేరో చోట పడింది. అంతే ఇక రాజీవ్ లేరని నిర్థారించుకున్నారు. మూపనార్, రామ్మూర్తి వెంటనే తమ శాలువా తీసి రాజీవ్ శరీరం మీద కప్పి స్ట్రైచర్ కోసం కబురు పంపారు. అప్పటికే అంతా అయిపోయింది. 15 మంది మృత్యు వాత పడగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మరణించారు.

శ్రీలంక నుంచి వచ్చిన మానవ బాంబు ధాను, శోభాలతో పాటు..నళిలి, మురుగన్, ఒంటికన్ను శివరాజన్, పయాస్, అరివు, భాగ్యనాధన్ సుబ్రమణ్యం తదితరులు ఈ పేలుడులో సూత్రధారులుగా నిర్థారించారు. రాజీవ్ గాంధీ హత్య కేసును విచారించిన సిట్ బృందానికి డి.ఆర్. కార్తికేయన్ ఎంతో ఓపిగ్గా..చాక చక్యంగా ఈ విషయాలను వెలికి తీశారు. అనంతరం వారికి శిక్ష పడింది.  
Previous
Next Post »