0

‘జీన్స్’ వేసుకుని అలా చేయకూడదట..?

jeans
ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్ అనే పదం లేకుండా ట్రెండ్ నడవడం లేదు. అందులోనూ జీన్స్ ఫ్యాంట్ పొందినంత ప్రాచుర్యం మరే ఇతర దుస్తులు నేటి ఫ్యాషన్ ప్రపంచంలో పొంది ఉండవు. అయితే, సౌకర్యవంతంగా, స్టైల్ గా ఉంటూ ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ జీన్స్ ఫ్యాంట్ లతో కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు పరిశోధకులు.

తాజాగా జీన్స్ ప్యాంట్ల వల్ల కలిగే అనర్ధాలపై జరిగిన అధ్యయనాల్లో కొన్ని అంశాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ అధ్యయనం ద్వారా జీన్స్ వేసుకుని కింద కూర్చోవడం, అందులోనూ జీన్స్ ప్యాంట్లు తొడుక్కుని కాళ్ళు ముడుచుకుని కూర్చోవడం (బాసిపటం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు పరిశోధకులు. జీన్స్ ప్యాంట్ వేసుకుని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయని, ఇది మరీ ఎక్కువైతే జీన్స్ ప్యాంట్లతో కాళ్ళు ముడుచుకుని కూర్చునే వాళ్ళకు అస్సలు నడవలేని పరిస్థితి కూడా రావొచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా వ్యాయామం చేసే సమయంలో జీన్స్ వేసుకోవడం, జీన్స్ వేసుకుని ‘స్క్వాటింగ్’ చేయడం ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశాలన్నింటిని తాజాగా పరిశోధకులు ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్ లో ప్రచురించారు.
Previous
Next Post »