0

జేబులో పట్టే వాషింగ్ మిషన్.. దాని బరువు 200 గ్రాములు

washing machine
వాషింగ్ మిషన్... అంటే ఎంతుంటుంది. తక్కువలో తక్కువ అన్నా 50 ఇంచుల ఎత్తు. 30 ఇంచుల పొడవు వెడల్పు ఉంటుంది. అది కూడా ఇంటిలో కొంత భాగాన్ని ఆక్రమిస్తుంది. ఇది ఇప్పటి వరకూ మనకు తెలిసిన సత్యాలు. కానీ వాషింగ్ మిషన్ జేబులో పట్టిపోతుంది. అలాంటి మిషన్లను కూడా తయారు చేసేశారు. ఎక్కడ? ఎప్పుడు? 

హేయర్‌ కంపెనీ జేబులో పట్టేంత సైజు ఉన్న వాషింగ్‌ మిషన్‌ను అందుబాటులోకి తెస్తోంది. హేయర్‌ కోడో పేరుతో విడుదల చేసిన ఈ వాషింగ్‌ మిషన్‌ 200 గ్రాముల బరువుంటుంది. తినేటప్పుడు గానీ, టీ/కాఫీ తాగుతున్నప్పుడు గానీ షర్ట్‌పై పడే మరకలను వెంటనే ఈ వాషింగ్‌ మిషన్‌తో తుడిచేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ వాషింగ్‌ మిషన్‌ ప్రపంచంలోనే అతి చిన్నది. 

30 నుంచి 120 సెకన్ల వ్యవధిలోనే షర్ట్‌పై పడిన మరకను ఈ వాషింగ్‌ మిషన్‌ మాయం చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఇది ఇ-కామ్‌ సైట్‌ స్నాప్‌డీల్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. దీని ధర 3,990.
Previous
Next Post »